ఇవాంకాతో సుష్మా భేటీ

ఇవాంకాతో సుష్మా భేటీ

29-11-2017

ఇవాంకాతో సుష్మా భేటీ

ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు (జీఈఎస్‌) ప్రారంభానికి ముందు అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా ట్రంప్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ భేటీ అయ్యారు. హెచ్‌సీసీలో జరిగిన ఈ భేటీ 15 నిమిషాల పాటు సాగింది.ఈ సందర్భంగా మహిళల సాధికారత, ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఇద్దరు కూడా గతంలో ఒకసారి కలిసినందున ఇద్దరి క్షేమ సమాచారాలపై మాట్లాడిన అనంతరం ప్రధాన అంశాలపై మాట్లాడుకున్నారు. జీఈఎస్‌కు అమెరికా, భారత్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని సుష్మా అన్నారు. భారత్‌తో సంబంధాలు పట్టిష్టం చేసుకోవాలనే దిశలోనే ట్రంప్‌ ప్రభుత్వం ఉందని ఇవాంకా భరోసా ఇచ్చారు. పరస్పర సహకారం ఉభయతారకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.