గోల్కొండ కోటను సందర్శించిన ఇవాంక ట్రంప్‌

గోల్కొండ కోటను సందర్శించిన ఇవాంక ట్రంప్‌

29-11-2017

గోల్కొండ కోటను సందర్శించిన ఇవాంక ట్రంప్‌

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్‌ గోల్కొండ కోటను సందర్శించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోటకు వచ్చిన ఆమె, సుమారు 40 నిమిషాల పాటు కలియతిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఇవాంక తిలకించారు. హైదరాబాద్‌, గోల్కొండ కోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని ఆమె వీక్షించారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే డిజిటల్‌ ప్రదర్శనను ఇవాంక తిలకించారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఇవాంక రాణిమహాల్‌ను కలియతిరిగారు. కోట సందర్శన అనంతరం ఇవాంక ట్రైడెండ్‌ హోటల్‌కు బయల్దేరి వెళ్లారు.

Click here for Photo Gallery