మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు
MarinaSkies
Kizen

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు

29-11-2017

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. మంత్రి కేటీఆర్ జీఈఎస్ ఏర్పాట్లు ఘనంగా చేశారని కొనియాడారు. సదస్సు అనుకున్నదానికంటే ఘనంగా విజయవంతమైందన్నారు. జీఈఎస్ సదస్సు నిర్వహణపై ముందునుంచి కేటీఆర్ ప్రత్యేకదృష్టి సారించారు. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహణను ఘనంగా నిర్వహించేందుకు శ్రమించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.