ఇవాంకకు చార్మినార్‌ ఫిలిగ్రీ

ఇవాంకకు చార్మినార్‌ ఫిలిగ్రీ

29-11-2017

ఇవాంకకు చార్మినార్‌ ఫిలిగ్రీ

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ముఖ్యమంత్రి కే చందశేఖర్‌రావు ఫిలిగ్రీతో రూపొందించిన చార్మినార్‌ను అందించారు. మంగళవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు అనంతరం ఇవాంకకు శాలువా కప్పి, ఆమె కోసం ప్రత్యేకంగా తయారుచేయించిన జ్ఞాపికను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీతో కాకతీయ తోరణం, చార్మినార్, హంస, నెమలి వంటి పలురకాల నమూనాలతో జ్ఞాపికలను తయారుచేయించారు. వీటిలో ప్రధాని మోదీ, ఇవాంకకు చార్మినార్‌ను అందజేశారు.