ఫ్రిబవరిలో ఇవాంకతో కేటీఆర్‌ భేటీ!
Agnathavasi
Ramakrishna

ఫ్రిబవరిలో ఇవాంకతో కేటీఆర్‌ భేటీ!

30-11-2017

ఫ్రిబవరిలో ఇవాంకతో కేటీఆర్‌ భేటీ!

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో అమెరికాలో ఇవాంకతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల ఇవాంక సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ప్రసంగంలోనూ దీనినే ఉటంకించారు. జీఈఎస్‌లో భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తాను ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉందని ఇవాంకతో ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. అయితే అమెరికాకు వచ్చినట్టయితే తనను తప్పకుండా కలువాలని ఇవాంక సూచించినట్టు సమాచారం.