ఇవాంక మూడు డ్రెస్‌లు రూ.5.37 లక్షలు

ఇవాంక మూడు డ్రెస్‌లు రూ.5.37 లక్షలు

30-11-2017

ఇవాంక మూడు డ్రెస్‌లు రూ.5.37 లక్షలు

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్యవేత్త సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంక మూడు డ్రెస్సుల ఖరీదు రూ.5.37 లక్షలు. ఆమె భారత పర్యటనకు మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఎయిర్‌పోర్టులో ఆమె ముత్యాలతో కూడిన జాకెట్‌తో ధరించిన ఆ డ్రెస్‌ ఖరీదు 1298 డాలర్లు. ఆ తరువాత సదస్సులో ప్రధానితో కలిసి ప్రసంగించినప్పుడు ఆమె ధరించిన గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌ ఖరీదు రూ.3550 డాలర్లు. ఇక విందుకు హాజరైనప్పుడు బంగారు వర్ణంతో మెరిసిపోతున్న పూవులతో ఆమె ధరించిన డ్రస్‌ కనిపించింది. ఆ డ్రెస్‌ ఖరీదు 3498 డాలర్లు. ఈ మూడు డ్రెస్‌లు ఖరీదు మొత్తం 8346 డాలర్లు. సరాసరి మన కరెన్సీలతో రూ.5,37,000లుగా చెప్పొచ్చు.