మహిళా పారిశ్రామిక వేత్తలకు విహబ్‌

మహిళా పారిశ్రామిక వేత్తలకు విహబ్‌

01-12-2017

మహిళా పారిశ్రామిక వేత్తలకు విహబ్‌

రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని, వారి కోసం వి హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, తాము ఏర్పాటు చేయనున్న ఈ హబ్‌ దేశానికే మార్గదర్శకంగా ఉండబోతుందని ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. జీఈఎస్‌ ముగింపు సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మహిళలకు ప్రత్యేక ప్రణాళికలను తీసుకుని వస్తున్నట్టు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం మూడు నిర్ణయాలు ప్రకటించారు. మహిళా వ్యాపార వేత్తల కోసం ప్రత్యేకించి వీ హబ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. వి హబ్‌ అంటూ వుమెన్‌ ఎంపరర్‌ హబ్‌ అని ఈ సందర్భంగా తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం కోసం రూ.15కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోలు చేసే వస్తువుల విషయంలో మహిళా వ్యాపారవేత్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కొన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో నాలుగో వంతు మహిళా పారిశ్రామికవేత్తల నుంచి కొంటామని హామీ ఇచ్చారు.