మహాసభలకు విదేశీ ప్రముఖులు

మహాసభలకు విదేశీ ప్రముఖులు

08-12-2017

మహాసభలకు విదేశీ ప్రముఖులు

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ 36 మంది విదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు సాహిత్య అకాడమీ తెలిపింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, చరిత్ర రంగాల్లో పరిశోధన చేసిన ప్రముఖులు, రచయితలు, కవులు, కళాకారులను పాల్గొనాలని సంప్రదించామని, 36 మంది ఈ సభల్లో పాల్గొంటారని అకాడమీ పేర్కొన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే విమాన చార్జీలు, భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తుందని వెల్లడించింది. అమెరికా నుంచి 23 మంది, బ్రిటన్‌ నుంచి ఇద్దరు, కెనడా నుంచి ఒక్కరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, మలేషియా నుంచి ఇద్దరు, మారిషస్‌ నుంచి నలుగురు, ఫ్రాన్స్‌ నుంచి ఒకరు, కువైట్‌ నుంచి ఒకరు పాల్గొంటారని తెలిపింది.