ఏపీ నుంచి 353 మంది ప్రతినిధులు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఏపీ నుంచి 353 మంది ప్రతినిధులు

09-12-2017

ఏపీ నుంచి 353 మంది ప్రతినిధులు

ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 353 మంది ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో 289 మంది, రవీంద్ర భారతిలోని తెలుగు మహాసభల కార్యాలయంలో 64 మంది రూ.500 ఫీజు చెల్లించి ఎంట్రీ చేసుకున్నారు. సభలకు ముందుగానే పేరు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక పాస్‌లను ఆహ్వాన కమిటీ జారీ చేయనుంది. సభా ప్రాంగణంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు మహాసభలకు మొత్తం 7920 మంది దరఖాస్తు చేసుకున్నారు. పదివేలకు పైగా రిజిస్ట్రేషన్లు వస్తాయని ప్రభుత్వం భావించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా స్పందన కన్పించలేదు. 40 దేశాల నుంచి 160 మంది ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి 1167 మంది, తెలంగాణ నుంచి 6 వేల మంది ప్రతినిధులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు భాషతో అనుబంధమున్న 56 మంది అతిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.