ప్రారంభ సంరంభానికి 40 వేల మంది

ప్రారంభ సంరంభానికి 40 వేల మంది

09-12-2017

ప్రారంభ సంరంభానికి 40 వేల మంది

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభోత్సవ సంరంభం జరిగే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియాన్ని సుందరంగా అలంకరించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న సాయంత్రం మహాసభలు ప్రారంభమవుతాయి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అతిథులు కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీలు, శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, నిర్వహణ ప్రధాన కమిటీ సభ్యులు వేదికను అలంకరించనున్నారు.