మహాసభల వేదికపై 31 జిల్లాల కళల ప్రదర్శన
Agnathavasi
Ramakrishna

మహాసభల వేదికపై 31 జిల్లాల కళల ప్రదర్శన

13-12-2017

మహాసభల వేదికపై 31 జిల్లాల కళల ప్రదర్శన

ప్రపంచ తెలుగు మహాసభల్లో 31 జిల్లాలకు సంబంధించిన అన్ని కళలను  ప్రదర్శించనున్నట్లు సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తెలిపారు. ప్రత్యేకమైన సంప్రదాయ కళలన్నింటిని కూడా ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు.  తెలంగాణ జానపద సాంస్కృతిక కళా వైభవం పేరుతో 200 మందితో దీనిని ప్రదర్శించనున్నాం. మన తెలంగాణలో అన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యతతో కూడుకున్నవి మన జానపద కళా రూపాలని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాలు, పేరిళ్లలతో పాటు కళారూపాలను ఇక్కడ ప్రదర్శనలో చోటుకల్పించామన్నారు. ఇవన్నీ కూడా ప్రాధాన్యతతో కూడుకున్నవే కాబట్టే తరతరాల వారసత్వం ంకా బతికిందన్నారు.

ప్రస్తుతం ఈ మహాసభల్లో తెలంగాణ కళలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత తెలుగు మహాసభలు ఇక్కడ జరగడం సంతోషంగా ఉందని, ఇప్పుడు మనతెలంగాణ భాషను, యాసను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ మహాసభలను నిర్వహించుకుందామన్నారు. బూజుపట్టిన మన కళా రూపాలని బయటకు తీసి ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రదర్శన ఇవ్వాలన్నదే మన ముందున్న కర్తవ్యమన్నారు. ప్రతి తెలంగాణ కళాకారుడు మేల్కొని తెలుగు మహాసభల్లో తెలంగాణ వారు దేనిలో తక్కువ కాదని నిరూపించాలని ఆయన సూచించారు. దీనికోసం ప్రతిఒక్కరూ అహర్శిశలు కృషి చేయాలన్నారు. సాంస్కృతిక శాఖ తరపున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు మళ్లీ 5 సంవత్సరాల తరువాత వచ్చే మహాసభల వరకు గుర్తుండేలా కార్యక్రమాలను రూపొందించామని ఆయన పేర్కొన్నారు.