200 పుస్తకాలు ఆవిష్కరిస్తాం

200 పుస్తకాలు ఆవిష్కరిస్తాం

13-12-2017

200 పుస్తకాలు ఆవిష్కరిస్తాం

ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ఐదు రోజుల్లో 200కి పైగా పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. తెలుగు అకాడమీ, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సాహిత్య వికాసక్రమం, రికార్డుల్లో  నమోదు కాని చరిత్ర ఆ పుస్తకాల్లో ప్రస్ఫుటంగా ఉంటుందని వివరించారు. అతిథులు, ప్రముఖులకు తెలంగాణ సంస్కృతి, ఔన్నత్యాన్ని వివరించేలా ఒక సినిమాను రూపొందించామని సిధారెడ్డి తెలిపారు. రోజూ మహాసభల ప్రారంభ, ముగింపు సమయాల్లో ఆ సినిమాను ప్రదర్శిస్తామని చెప్పారు. గంట పాటు ఉండే ఈ సినిమాను తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా రూపొందించిందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, ప్రసంగాల వివరాలను ఒక పుస్తకంగా రూపొందిస్తామని అన్నారు.