నేటి నుంచి ఐదు రోజులపాటు మహాసభలు

నేటి నుంచి ఐదు రోజులపాటు మహాసభలు

15-12-2017

నేటి నుంచి ఐదు రోజులపాటు మహాసభలు

నేటి నుంచి తెలుగు పండుగ ప్రారంభం కానుంది. ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్యనగరం ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 19 వరకు ఐదు రోజులపాటు తెలుగు సభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు  పూర్తయ్యాయి. సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా సభలు ప్రారంభం కానున్నాయి. సభల ప్రారంభం, ముగింపు వేడుకలకు ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. తెలుగు మహాసభలకు ముఖ్య అతితిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాధ్యక్షుడిగా వ్వవహరించనున్నారు. గవర్నర్లు నరసింహన్‌, విద్యాసాగర్‌ రావులు విశిష్ట అతిథులుగా రానున్నారు.