ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

15-12-2017

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ విచ్చేసిన ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, డిప్యూటీ సీఎంలు మహముద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.