ఉర్దూ కన్నా తెలుగు సులభం

ఉర్దూ కన్నా తెలుగు సులభం

16-12-2017

ఉర్దూ కన్నా తెలుగు సులభం

ఉర్దూ కన్నా తెలుగు మాట్లాడటం, నేర్చుకోవడం సులభమని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరుగుతున్న బృహత్‌ కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతే తాను తెలుగు నేర్చుకున్నట్లు తెలిపారు. హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 12వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయడం మంచి పరిణామం అని అన్నారు. ఏదేశమేగినా, కన్న తల్లిని, మాతృభూమిని, మాతృ భాషను మరిచిపోవద్దని ఆయన సూచించారు.