తెలంగాణ తెలుగే అసలు తెలుగు : కడియం

తెలంగాణ తెలుగే అసలు తెలుగు : కడియం

16-12-2017

తెలంగాణ తెలుగే అసలు తెలుగు :  కడియం

తెలంగాణ తెలుగే అసలు తెలుగు అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటు చెబుదామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా బృహత్‌ కవి సమ్మేళనం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరై ప్రసంగించారు. తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. పల్లె పాటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరి నాట్లు వేసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పాడే పాట ఇప్పుడు కనుమరుగయ్యాయి. అలాంటి పాటలను మళ్లీ  ప్రజల్లోకి తీసుకురావాలని ఆయన కవులకు విజ్ఞప్తి చేశారు.