చరిత్రలో ప్రపంచ తెలుగు మహాసభలు : ఈటల

చరిత్రలో ప్రపంచ తెలుగు మహాసభలు : ఈటల

16-12-2017

చరిత్రలో ప్రపంచ తెలుగు మహాసభలు : ఈటల

ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్‌ కవి సమ్మేళానికి మంత్రి హాజరై మాట్లాడారు. గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం ఉండాలని చెప్పారు. ఒక సిరా చుక్క ఎంతో మందిని కదిలిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పాటలు, ఆటలు ప్రజల గుండెల్ని కదిలించాయని గుర్తు చేశారు.  సీఎం కేసీఆర్‌ తెలుగు భాషాభిమాని అని అన్నారు.