నాలుగోరోజు అట్టహాసంగా మహాసభలు

నాలుగోరోజు అట్టహాసంగా మహాసభలు

18-12-2017

నాలుగోరోజు అట్టహాసంగా మహాసభలు

రవీంద్ర భారతిలోని డా. యశోదారెడ్డి ప్రాంగణంలో నాలుగోరోజు తెలుగు మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా అచ్చమాంబ వేదికపై మహిళా సాహిత్యం అంశంపై చర్చ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఆచార్య శరత్‌ జ్యోత్స్నరాణి, కవయిత్రులు ముదిగొండ సుజాతారెడ్డి, జూపాక సుజాత, జూపాక సుభద్ర, గోగుల శ్యామల, కొండపల్లి నిహారిణి తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన సాహిత్యం గురించి సమాజంలో మహిళ పాత్ర అనే అంశంపై వక్తలు మాట్లాడారు. ప్రాచీన కవిత్వం, సాహిత్యం, గురించి కవయిత్రి సుజాతారెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కవయిత్రి సూర్య ధనుంజయ్‌ అధ్యక్షత వహించారు.