తెలుగు భాష ప్రాచీనతపై ఎంపీ కవిత ప్రజెంటేషన్..
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

తెలుగు భాష ప్రాచీనతపై ఎంపీ కవిత ప్రజెంటేషన్..

19-12-2017

తెలుగు భాష ప్రాచీనతపై ఎంపీ కవిత ప్రజెంటేషన్..

నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్య రచన జరిగిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రవీంద్రభారతిలో ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ  తెలుగు భాష పట్ల ప్రవాస తెలుగువారికి మక్కువ ఎక్కువన్నారు. తెలుగు మహాసభల్లో సాహిత్యానికి పెద్ద పీట వేశామన్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగును తప్పనిసరి చేయడంతో ఎంతోమంది స్వాగతించిన్రన్నారు.

తెలుగు భాష ప్రాచీనతపై ఎంపీ కవిత ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడో శతాబ్దంలోనే కోటిలింగాల ప్రాంతంలో నాణేలు దొరికాయని ఎంపీ కవిత తెలిపారు. కరీంనగర్ జిల్లా కురిక్యాలలో కందపద్యం పుట్టింది. నన్నయ కంటే 100 ఏళ్ల ముందే తెలంగాణలో కావ్య రచన జరిగిందన్నారు. తెలుగు సాహిత్యంలో వేములవాడ సాహిత్యయుగం కీలకమని.. కాకతీయుల యుగం తెలుగుకు స్వర్ణయుగమని ఎంపీ కవిత తెలిపారు. తెలుగు అనే పదం మొదటవాడిన కవి పాల్కురికి సోమన. తెలుగులో తొలి వచన కవి కృష్ణమాచార్యులు. తొలి తెలుగు రామాయణాన్ని రచించిన కవి గోన బుద్ధారెడ్డి. తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించి పది మందికి చాటిచెప్పాలని కోరారు.


Click here for Photogallery