తెలుగు భాషపై ప్రవాస తెలుగువారికి మక్కువ ఎక్కువే : కవిత

తెలుగు భాషపై ప్రవాస తెలుగువారికి మక్కువ ఎక్కువే : కవిత

19-12-2017

తెలుగు భాషపై ప్రవాస తెలుగువారికి మక్కువ ఎక్కువే : కవిత

విదేశాల నుంచి మహాసభలకు వచ్చిన ప్రవాస తెలుగువారికి ఎంపీ కవిత ధన్యవాదాలు తెలియజేశారు. 42 దేశాల నుంచి ప్రపంచ తెలుగు మహాసభలకు తరలివచ్చిన్రని వెల్లడించారు. రవీంద్రభారతిలో ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ తెలుగు భాష పట్ల ప్రవాస తెలుగువారికి మక్కువ ఎక్కువన్నారు. తెలుగు మహాసభల్లో సాహిత్యానికి పెద్ద పీట వేశామన్నారు. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగును తప్పనిసరి చేయడంతో ఎంతో మంది స్వాగతించిన్రన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click here for Photogallery