రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఘన స్వాగతం
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఘన స్వాగతం

19-12-2017

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఘన స్వాగతం

తెలుగు ప్రపంచ మహాసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఐదు రోజులుగా వైభవంగా జరుగుతున్న ఈ మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బేగం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆయన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్‌, డీజీపీ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాలువాతో ఘనస్వాగతం పలికారు. భారత వాయుసేవ విమానంలో బేగంపేటకు చేరుక్ను రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రేపు ఉదయం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం వద్ద నివాళులర్పించిన తర్వాత ఆయన ఢిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన పర్యటించే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Click here for Photogallery