హైదరాబాద్ లో పేటిఎం మాల్ “షాపింగ్ వేడుక"

హైదరాబాద్ లో పేటిఎం మాల్ “షాపింగ్ వేడుక"

07-01-2018

హైదరాబాద్ లో పేటిఎం మాల్ “షాపింగ్ వేడుక

పేటిఎం మాల్ హైదరాబాద్ లో “షాపింగ్ వేడుక’ యొక్క మొట్టమొదటి సంచిక ఆవిష్కరించింది

  • 1000+ స్థానిక రీటైలర్స్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్ మరియు ఫాషన్ విభాగాలలో 80% శాతం వరకు తగ్గింపు అందిస్తోంది మరియు100% క్యాష్ బాక్ అందిస్తోంది
  • మార్కెటింగ్, క్యాష్ బ్యాక్ మరియు అదనపు ప్రమోశాహన్స్ పై ప్రత్యేకంగా హైదరాబాద్ వినియోగదారులకు 50 కోట్లకు పైగా ఖర్చుచేయుటకు సిద్ధమయింది
  • ప్రతిరోజు అదృష్ట విజేతలకు సుజుకి గిక్సెర్ మోటార్స్ సైకిల్స్ అందించుట

పేటిఎం మాల్, పేటిఎం ఇకామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కంపెనీ, హైదరాబాదు లో 5 నుండి 17 జనవరి వరకు ఒక పదమూడు రోజుల షాపింగ్ ఉత్సవాన్ని ప్రకటించింది. ఈ కంపెనీ విశ్వసనీయ స్థానిక దుకాణాలు మరియు బ్రాండ్ అధీకృత స్టోర్స్ యొక్క సాంకేతిక భాగస్వామిగా మారు ఉద్దేశంతో, వారికి ఆన్ లైన్ లో స్టోర్స్ ఏర్పాటుచేసుకొను వీలు కల్పించుట లక్ష్యంగా కలిగి ఉంది. దీనివలన రీటైలర్స్ యొక్క సంపాదనా సామర్థ్యాలు పెరుగుతాయి, అంతే కాకుండా ఆన్ లైన్ షాపింగ్ కు సంబంధించిన విశ్వసనీయత మరియు సౌకర్యం కూడా లభిస్తాయి. ఇది వేల కొలది స్థానిక దుకాణాలకు క్యుఆర్ కోడ్స్ కూడా అందించి, వారి ఉనికిని మరియు మార్కెటింగ్ అవకాశాలను పెంచింది.

ఇది మార్కెటింగ్, క్యాష్ బ్యాక్ మరియు ప్రమోషనల్ ఖర్చులకు 50 కోట్లను కేటాయించింది, ఇది హైదరాబాద్ టాప్ బ్రాండ్ స్టోర్స్ అయిన లెనోవో, సుజుకి, హోండా, బాగిట్, టైమెక్స్, ఫాజిల్, పీటర్ ఇంగ్లాండ్, సాంసంగ్, ఫైయింగ్ మిషిన్, బిగ్ బజార్, మరియు స్థానిక రీటైల్ చైన్స్ అయిన బజాజ్ ఎలెక్ట్రానిక్స్, సెంట్రో, కళామందిర్, చందన బ్రదర్స్, నీరుస్ లాంటి 1000 కి పైగా స్టోర్స్ తో కలిసి పనిచేస్తోంది. ఇది ఫోరం సుజనా మాల్ భాగస్వామ్యంతో విస్తృత సరళి ఉత్పాదనలను ఆకర్షణీయమైన ధరలకు అందిస్తోంది. ఈ విక్రయంలో, ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్స్ మరియు ఫ్యాషన్ ఉంటాయి, ఇందులో దుస్తులు, పాదరక్షలు మరియు ఉపకరణాలు 80% రాయితీలతో మరియు 100% క్యాష్ బ్యాక్ తో ఉంటాయి. అదనంగా, ఈ వేదికలో ఉచిత షాపింగ్ వోచర్స్, లక్కీ గిఫ్ట్స్ మరియు రఫ్తార్ కోసం పేటిఎం మాల్ హైదరాబాద్ ఉత్సవంకు ఉచిత టికెట్లు ఉంటాయి. ఈ వేడుకలో ప్రతిరోజు లక్కీ విన్నర్స్ కు సుజుకి జిక్సెర్ మోటార్స్ సైకిల్స్ కూడా ఇవ్వబడతాయి.

ఈ కంపెనీ ఆన్ లైన్ నుండి ఆఫ్ లైన్  (020) మాడల్ కు రెట్టింపు క్రిందికి వచ్చింది, ఎందుకంటే హైదరాబాదులోని చాలావరకు టాప్ రీటైలర్స్ మరియు స్థానిక బ్రాండ్లు ఒకే వేదికపై విక్రయించవచ్చు. ఒకవినియోగదారుడు పేటిఎం మాల నుండి ఉత్పత్తులను కొనవచ్చు, అవి సమీప బ్రాండ్ అధీకృత స్టోర్ ద్వారా సర్వీస్ చేయబడతాయి, లేదా స్థానిక రీటైన్ చైన్ ద్వారా కొనవచ్చు లేదా ఈ స్టోర్స్ లోనికి నేరుగావ్ ఎళ్ళి అలాంటి ఆఫర్స్ పొందవచ్చు. వారు, 20 ప్రదేశాలలో,కాలేజిలు, మాల్స్ మరియు ఇతర అవుట్ డోర్ ప్రదేశాలలోని 90 పేటిఎం మాల్ ఆఫ్ లైన్ స్టాల్స్ లో దేనిలోనైనా కొలుగోలు చేయవచ్చు. దీనివలన పేటిఎం మాల్స్ భాగస్వామ్య రీటైలర్స్ హైదరాబాద్ లోని అతిపెద్ద షాపింగ్ సీజన్ అయిన ఈ సంక్రాంతికి తమ విక్రయాలను పెంచుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులో అన్ని సేల్ ఆర్డర్స్ కూడా అతి తక్కువ సమయంలో బట్వాడా చేయబడు సౌకర్యం కూడా ఉంది.

అమిత్ సిన్హా, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ – పేటిఎం మాల్ ఇలా అన్నారు, “హైదరాబాద్ మాకు ఒక ముఖ్యమైన మార్కెట్ మరియు షాపింగ్ ఉత్సవం, మా వినియోగదారుల మరియు వ్యాపారులపట్ల మా నిబద్ధతను ప్రదర్శిస్తుంది. నగరంలోని 1000 కి పైగా టాప్ బ్రాండ్ స్టోర్స్, స్థానిక రీటైల్ చైన్స్ మరియు ప్రముఖ మాల్స్ తో భాగస్వామ్యం కలిగి, ఆకర్షణీయ ధరలకు అతిపెద్ద శ్రేణి వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నందుకు మాకెంతో ఉత్తేజంగా ఉంది.  ఇది భారతదేశపు అతి పెద్ద మాల్ లో చేరుటకు హైదరాబాద్ రీటైల్ కమ్యూనిటీకి ఒక గొప్ప అవకాశం, మరియు వినియోగదారునికి వారు ఆన్ లైన్ షాపింగ్ లోనైనా లేదా వారి ఫేవరెట్ ఆఫ్ లైన్ షాపింగ్ లోనైనా, ఉత్తమ షాపింగ్ డీల్స్ పొందుటకు ఒక గొప్ప అవకాశం.”

జనవరి 12న, కంపెనీ నిజాం గ్రౌండ్స్ లో హైదరాబాద్ ఉత్సవం నిర్వహిస్తుంది, ఇందులో 30 కంటే ఎక్కువ టాప్ బ్రాండ్స్ ఉంటాయి మరియు రఫ్తార్ మరియు 5 ప్రఖ్యాత తెలుగు కళాకారుల ద్వారా ఒక కచేరి ఉంటుంది. ఈ ఉత్సవంలో ఇంటెల్, సుజుకి, మరియు ఫోరం సుజనా మాల్ కూడా ఈవెంట్ భాగస్వాములుగా ఉంటారు, రేడియో మిర్చి వారు యాక్టివేషన్ పార్ట్ నర్ గా మిగతా టాప్ బ్రాండ్స్ అయిన బిగ్ బజార్, లెనోవో, మైక్రోసాఫ్ట్, సిస్కా,హేవెల్స్, ఏసర్, సోనీ ఎలెక్ట్రానిక్స్, గ్రామీణ్, బాగిట్, కిల్లర్ జీన్స్, అన్ లిమిటెడ్, ప్రెస్టీజ్, హోండా మరియు టివిఎస్ లు కూడా ఉంటారు.