హెచ్‌ 1బీ వీసాలపై జోక్యం చేసుకోవాలి

హెచ్‌ 1బీ వీసాలపై జోక్యం చేసుకోవాలి

08-01-2018

హెచ్‌ 1బీ వీసాలపై జోక్యం చేసుకోవాలి

హెచ్‌ 1బీ వీసాల జారీని కట్టుదిట్టం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెందిన సుమారు 15 లక్షల మంది హెచ్‌ 1బీ వీసా దారులు ఇబ్బంది పడతారన్నారు. పాకిస్థాన్‌కు అమెరికా సహాయాన్ని నిలిపివేయడాన్ని బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటున్నదని, అయితే హెచ్‌ 1బీ వీసాల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.