ఐటీ టవర్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

ఐటీ టవర్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

08-01-2018

ఐటీ టవర్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్‌ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌, ఎమ్మెల్మేలు రసమయి బాలకిషన్‌, గుంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో పాటు పలువరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే స్మార్ట్‌ సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్‌ పట్టణం ఇప్పుడు ఐటీ పరిశ్రమల స్థాపనతో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకోనుంది. ఈ ఐటీ టవర్‌ను 50వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించనున్నారు. ఉత్తర తెలంగాణ నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఐటీ టవర్స్‌తో సుమారు వెయ్యి మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి..