పంటల బీమాపై అమెరికన్‌ వర్సిటీ అధ్యయనం

పంటల బీమాపై అమెరికన్‌ వర్సిటీ అధ్యయనం

09-01-2018

పంటల బీమాపై అమెరికన్‌ వర్సిటీ అధ్యయనం

మన దేశంలో అమలవుతున్న పంటల బీమా పథకంపై అధ్యయనం చేసేందుకు అమెరికాలోని జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ వీ ప్రవీణ్‌రావుతో భేటీ అయ్యారు. దేశంలో అమలవుతున్న వ్యవసాయ బీమా పథకం అమలుతీరు, రైతులకు మరింత మేలు కల్గించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నట్లు జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రతినిధులు కరీనా అబోర్న్‌సెన్‌, సీవీ కుమార్‌ ఉపకులపతికి వివరించారు.

రాష్ట్రంలో అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారాన్ని కోరారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఉపకులపతి డాక్టర్‌ వీ ప్రవీణ్‌రావు ఈ నెల 17 నుంచి 20 తేదీలు మధ్య పంటల బీమాకు సంబంధించిన నిపుణులు, విశ్వవిద్యాలయంలోని అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ విభాగాల అధ్యాపకులు, వ్యవసాయశాఖ అధికారులతో ఒక సెమినార్‌ను నిర్వహించేందుకు అంగీకరించారు. దీంతోపాటు తమ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ చేసుకోవటానికి అవకాశం కల్పంచాలని జాన్స్‌ హోప్‌ కిన్స్‌ బిజినెస్‌ స్కూల్‌కి చెందిన ఫ్యాకల్టీ సభ్యులు ఉపకులపతిని కోరారు.