22న దేశశ్యాప్తంగా రక్తదాన శిబిరాలు

22న దేశశ్యాప్తంగా రక్తదాన శిబిరాలు

10-01-2018

22న దేశశ్యాప్తంగా రక్తదాన శిబిరాలు

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భÛంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా 300 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ట్రస్ట్‌ సీఈవో విష్ణువర్ధన్‌తో కలిసి ఆమె మీడియతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ లెజెండరీ రక్తదాన శిబిరాలు పేరుతో పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి, యువతరానికి రక్తదానంపై అవగాహన కల్పించడానికి ఫేస్‌బుక్‌ సంస్థతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించే శిబిరాలపై ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం చేస్తామని, ఇందులో ఎవరైనా పేరు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఒక సారి పేరు నమోదు చేసుకున్నవారికి తరవాత ఎప్పుడైనా రక్తం అవసరమైతే వారికి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో సదరు గ్రూపు రక్తదాతలకు ఫేస్‌బుక్‌ నుంచి వెంటనే సంక్షిప్త సందేశం వెళుతుందని వివరించారు. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే నమోదు చేసుకున్న 40 లక్షల మంది రక్తదాతలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌  బ్లడ్‌బ్యాంక్‌కు సైతం రిజిస్టర్‌ అయ్యారని విష్ణువర్ధన్‌ తెలిపారు.