అంధ విద్యార్థులకు అండగా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్‌
APEDB

అంధ విద్యార్థులకు అండగా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్‌

10-01-2018

అంధ విద్యార్థులకు అండగా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్‌

అంధ విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్‌ తన సేవలను మరింతగా విస్తరించాలని అనుకుంటోంది.  రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్‌ అంధ విద్యార్థుల వసతి గృహం ఉంది.  2007 అక్టోబర్‌ 26న కుమారి పరుచూరి జ్యోతి ఈ ఫౌండేషన్‌ తరపున వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటివరకు దాదాపు 600 మందికి ఆశ్రయమిచ్చి వారికి ఉచిత వసతితోపాటు, ఉన్నత విద్యాభ్యాసాన్ని అందించింది. వారు మరింతగా రాణించేలా కంప్యూటర్‌ శిక్షణ, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, బ్రెయిలీ, మొబిలిటీ, హోమ్‌ మేనెజ్‌మెంట్‌, బ్యాంక్‌ కోచింగ్‌ వంటివి కూడా అందిస్తోంది.

ఈ ఫౌండేషన్‌లో దాదాపు 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సేవా సంస్థగా రిజిష్టర్‌ అయిన ఈ సంస్థ తమ సేవలను మరింతగా విస్తరించాలని అనుకుంటోంది. బ్రెయిలీ డిప్లొమా కాలేజీ వొకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా అంధవిద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, సొంతంగా వారు ఉపాధిని సంపాదించుకునేలా  చేయడం వంటివి చేయాలని అనుకుంటోంది. అదే సమయంలో ఇప్పుడు ఉన్న భవనాన్ని మరింతగా విస్తరించి చాలామందికి వసతి సౌకర్యాలను కల్పించాలని భావిస్తోంది. ఇందుకోసం దాతలు ముందుకు వచ్చి ఉదారంగా సాయపడాలని అభ్యర్థిస్తోంది. దాతలు తమ విరాళాలను స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్‌ ఆంధ్రాబ్యాంక్‌ లేదా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు జమ చేయాలని కోరుతోంది. ఇతర వివరాలకు సంస్థను 9502854595, 9603981065లో సంప్రదించవచ్చు.

ఆంధ్రాబ్యాంక్‌

ఖాతా నెం. 138911100002041
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ANDB0001389

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ఖాతానెం. 32891716500
ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ SBIN0013150


Click here for Photogallery