హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

12-01-2018

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికకానుంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డబ్ల్యుసిఐటి) సదస్సు హెచ్‌ఐసిసిలో జరగనుంది. దీంతోపాటు నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ ఫోరమ్‌ (ఎన్‌ఐఎల్‌ఎఫ్‌) సదస్సు కూడా జరుగుతుంది. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌), వరల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలియన్స్‌ (డబ్ల్యుఐటిఎస్‌ఎ), తెలంగాణ ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు మీడియా సమావేశంలో తెలిపారు. 

ఇప్పటిదాకా  డబ్ల్యుసిఐటి విదేశాల్లోనే జరిగిందని, తొలిసారిగా మన దేశంలో అందులోనూ హైదరాబాద్‌లో జరుగుతుండటం ఎంతో గొప్ప విషయమని ఆయన తెలిపారు. ఎన్‌ఐఎల్‌ఎఫ్‌ పాతికేల్ల నుంచి ముంబైలోనే జరుగుతోందని, మొదటిసారిగా ఇది కూడా హైదరాబాద్‌లో జరగనుందని ఆయన తెలిపారు. ఈ రెండింటినీ కలిపి (డబ్ల్యుఐసిటి-ఎన్‌ఐఎల్‌ఎఫ్‌) ఏకకాలంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.