ఓయూ ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళం

ఓయూ ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళం

12-01-2018

ఓయూ ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళం

ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళంగా ఇచ్చేదుకు ఓయూ పూర్వ విద్యార్థి డాక్టర్‌ అజీజ్‌ అహ్మద్‌ జమాలుద్దీన్‌ ముందుకొచ్చారు. 2009లో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో అధికారులు ఆయన పేరు మీదే కంప్యూటర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అమెరికాలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డ ఆయన గురువారం ఆ కంప్యూటర్‌ సెంటర్‌ను తన కుటుంబ సభ్యులతో వచ్చి పరిశీలించారు. ఈ సెంటర్‌ ఏర్పాటుకు రూ.60 లక్షలు విరాళాన్ని అజీజ్‌ అందించారు. కాగా ఇక్కడ కంప్యూటర్లను ఉపయోగించుకుంటున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. 100 కంప్యూటర్ల సర్వీస్‌ అయిపోయినట్లు గుర్తించి వాటి స్థానంలో కొత్తగా 50 కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి విరాళం ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్‌ ఆఫైర్స్‌ డీన్‌ లక్ష్మీనారాయణ, ఓయూ పబ్లిక్‌ రిలేషన్స్‌ అడ్వైజర్‌ స్టీవెన్‌సన్‌, ఆర్ట్‌ కళాశాల వైస్‌ ప్రిన్స్‌పాల్‌ రాములు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఓయూ వీసీతో భేటీ అయిన అజీజ్‌ ఆర్ట్స్‌ కళాశాల మరమ్మతులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎండోమెంట్‌ ఫండ్‌ను ఉపయోగించుకోవాలని కోరారు.