సీఎం చంద్రబాబుతో మంత్రి కేటీఆర్ భేటీ

సీఎం చంద్రబాబుతో మంత్రి కేటీఆర్ భేటీ

24-01-2018

సీఎం చంద్రబాబుతో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్యుఈఎఫ్‌)లో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్‌ అక్కడ చంద్రబాబును కలుసుకున్నారు. చంద్రబాబుతో దిగిన ఫోటోను కేటీఆర్‌ ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అక్కడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, ఎంపీ గల్లా జయదేవ్‌ను కూడా కలిశారు. లోకేశ్‌కు జన్మదిన  శుభాకాంక్షలు తెలిపారు. గల్లా జయదేవ్‌తో సుహృద్భావ సమవేశం జరిగినట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.