హైదరాబాద్ లో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు

హైదరాబాద్ లో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు

08-02-2018

హైదరాబాద్ లో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు

మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంశర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(పిజెటిఎస్‌ఎయు)లో ఈ నెల 9 నుంచి 11 వరకు అగ్రి టెక్‌ సౌత్‌ 2018 సదస్సు జరగనుంది. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు సంబంధించి మూడు రోజుల ఎగ్జిబిషన్‌తోపాటు మొదటి రెండ్రోజులు వ్యవసాయ రంగ అవకాశాలు, సవాళ్లపై సమావేశాలు జరగనున్నాయి. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌ రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు అగ్రి టెక్‌ సౌత్‌ 2018 చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ వి ఏపూర్‌ తెలిపారు. ఇందులో వంద వరకు స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు, మూడు రోజుల్లో 15 వేల మంది రైతులు ఈ షోను సందర్శించే అవకాశం ఉందన్నారు.