తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలి

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలి

01-03-2018

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు విస్తృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం స్వయంగా ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తలో ధైర్యం వస్తుందని అన్నారు. త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభకు తాను హాజరవుతానని అన్నారు. పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్ని అన్నారు. ప్రస్తుతం పార్టీ బలోపేతం అంతా దృష్టి సారించాలని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీకి అండగా ఉంటానన్నారు. కొందరు నాయకులు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. మే నెలాఖరు నాటిని నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు.