మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా

మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా

03-03-2018

మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా

2019 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకూల పవనాల వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురించి ఆయన ఏకవచనంతో మాట్లాడారన్నారు. ఎప్పటికైనా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ వచ్చిన కేసీఆర్‌ మద్దతు మాత్రం ఎన్నటికీ కోరబోమని సృష్టం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ బీజేపీతో కలుస్తారన్నారు.