12 నుంచి శాసనసభ సమావేశాలు

12 నుంచి శాసనసభ సమావేశాలు

06-03-2018

12 నుంచి శాసనసభ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలపై రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసిహన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభలో గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 15న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. ఈ నెల 29 వరకు సమావేశాలు సాగే అవకాశముంది. శాసనసభలో ఎన్నిరోజులు సాగేది, బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెట్టేది ప్రభుత్వం సభాకార్యకలాపాల కమిటీ (బీఏసీ) సమావేశంలో అధికారికగా వెల్లడించనుంది.