సమంత చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదు
Nela Ticket
Kizen
APEDB

సమంత చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదు

19-04-2017

సమంత చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదు

నటి సమంతను చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదని తెలంగాణ ప్రభుత్వం సృష్టం చేసింది. చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళిశాఖ, లిఖిత పూర్వక జాతీయ అధ్యక్షుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కాగా సమంతను చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదని, ఇక దీనికి విధివిధానాలు, పారితోషికంలాంటి విషయాలు, ఒప్పందం, అపాయింట్‌మెంట్‌ లెటర్‌, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ప్రశ్న ఉత్పనం కాదని హ్యాండ్‌లు టెక్స్‌టైల్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి సృష్టం చేశారు.