సమంత సేవలు వినియోగించుకుంటాం
Nela Ticket
Kizen
APEDB

సమంత సేవలు వినియోగించుకుంటాం

20-04-2017

సమంత సేవలు వినియోగించుకుంటాం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న తెలంగాణ స్టేట్‌ హాండ్లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (టెస్కో)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటి సమంత సేవలను వినియోగించుకుంటామని ఆ సంస్థ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నటి సమంత బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ సమాచార, సమన్వయ లోపం కారణంగా ఇలా జరిగిందన్నారు. స్వచ్ఛందంగా చేనేత కోసం ముందుకు వచ్చిన సమంత సేవలను వినియోగించుకుంటామని, ఆమెను చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తించి, గౌరవించి మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే కృతజ్ఞతలు కూడా తెలిపారు. త్వరలోనే సమంతాతో ఇందుకు సంబంధించి అధికారిక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోనున్నామని శైలజా రామయ్యర్‌ అన్నారు.