ఈ అక్టోబర్‌లో చై-సామ్‌లు ఏడడుగులు ?
Sailaja Reddy Alluddu

ఈ అక్టోబర్‌లో చై-సామ్‌లు ఏడడుగులు ?

20-04-2017

ఈ అక్టోబర్‌లో చై-సామ్‌లు ఏడడుగులు ?

పెళ్లెప్పుడు అనడిగితే ఇటు నాగచైతన్య, అటు సమంత ఏం సమాధానం చెప్పడం లేదు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థమైన తర్వాత ఎవరి సినిమాలతో వారు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇద్దరూ చెరో రెండు సినిమాలు చేస్తున్నారు. పెళ్లి ఊసు వచ్చేసరికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల సమచారం ప్రకారం, ఈ అక్టోబర్‌లో చై-సామ్‌లు ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అంతకు ముందు అక్కినేని ఫ్యామిలీ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి మొగ్గు చూపుతుందని వార్తలొచ్చాయి. వాటిల్లో నిజం లేదట. హైదరాబాద్‌లోనే పెళ్లి జరగనుందని టాక్‌. ప్రస్తుతం చైతన్య, సమంత చేస్తున్న సినిమాల షూటింగులు అక్టోబర్‌కి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్లికి కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోనున్నారు.