అమెరికాలో నితిన్‌ 'లై' షూటింగ్‌
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

అమెరికాలో నితిన్‌ 'లై' షూటింగ్‌

20-04-2017

అమెరికాలో నితిన్‌ 'లై' షూటింగ్‌

అ ఆ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నితిన్‌ నటిస్తున్న సినిమా లై. లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిట్‌ అన్నది ఉపశీర్షిక. మేఘా ఆకాష్‌ కథానాయిక. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అమెరికాలో ఏకధాటిగా జరుగుతోంది. యూనిట్‌ సభ్యుల సమక్షంలో హను రాఘవవూడి పుట్టినరోజున బుధవారం జరుపుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ జూన్‌ రెండో వారం వరకు అమెరికాలో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోలో చిత్రీకరణ జరుపుతాం. దీంతో 90శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కాగా ఈ  చిత్రంలో హాలీవుడ్‌ నటుడు డాన్‌  బిల్జిరియాన్‌ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వి, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్‌, సంగీతం : మణిశర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌ : హరీష్‌ కట్టా,  సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి.