అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి

అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి

17-04-2018

అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్‌ జరిగింది. చిరంజీవి, అమితాబ్‌బచ్చన్‌, నయనతార తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం సైరా కి కాస్త విరామం ఇచ్చారు. చిరు వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చక, సైరా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. అమితాబ్‌పై రెండు కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారని సమాచారం. ఆయన కూడా ముంబై వెళ్లిపోయారు. కొత్త షెడ్యూల్‌ కోసం అమితాబ్‌ మళ్లీ హైదరాబాద్‌ వస్తారని చిత్ర బృందం చెబుతోంది. నయనతారతో పాటు తమన్నాని మరో కథానాయికగా ఎంచుకున్నారు. ఆమె పాత్రకీ కథలో కీలమైన స్థానం ఉందట. అందుకోసం తమన్నా కొన్ని ప్రత్యేక కసరత్తులు కూడా మొదలెట్టిందని సమాచారం.