హోదా ఉద్యమంలోకి టాలీవుడ్

హోదా ఉద్యమంలోకి టాలీవుడ్

17-04-2018

హోదా ఉద్యమంలోకి టాలీవుడ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో తెలుగు సినీ రంగం కూడా చేరనుంది. ఈ నెల 22న విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని భావించినా వాయిదా వేసినట్లు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ తెలిపారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణతో సంప్రదింపులు జరిపామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. మా అధ్యక్షుడు శివాజీరాజాతో చర్చించి త్వరలోనే తేదీని నిర్ణయిస్తామన్నారు.