బాహుబలి -2 లైన్ క్లియర్ ?
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

బాహుబలి -2 లైన్ క్లియర్ ?

21-04-2017

బాహుబలి -2 లైన్ క్లియర్ ?

కావేరీ జలాలపై కొన్నేళ్ల క్రితం నటుడు సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్‌ క్షమాపణ చెప్పకపోతే బాహుబలి ది కన్‌క్లూజన్‌ సినిమాని కర్ణాటకలో విడుదల కానివ్వమని కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సత్యరాజ్‌ కన్నడిగులకు క్షమాపణ చెప్పారు. నేను కర్ణాటక, కన్నడిగులకు వ్యతిరేకిని కాను. తొమ్మిదేళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పున్నాను. కానీ తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనే ఉంటాను. నాకు సినిమా రంగంలో పని దొరక్కపోయినా ఫర్యాలేదు అన్నారు. రాజమౌళి కన్నడలో మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేస్తూ కన్నడిగులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 28న బాహుబలి ది కన్‌క్లూజన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.