మహానటి లో అనుష్క ?
APEDB
Ramakrishna

మహానటి లో అనుష్క ?

21-04-2017

మహానటి లో అనుష్క ?

అలనాటి నటి సావిత్రి జీవిత ఘటనల ఆధారంగా మహానటి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్ల్రో నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇందులో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో సమంత విలేకరిగా, కీర్తి సావిత్రిగా నటిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు అనుష్క అలనాటి నటి జమున పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. జమున పాత్రకు అనుష్క సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తోంది. అంతేకాకుండా ప్రకాశ్‌రాజు ఇందులో ప్రముఖ నటుడు, సావిత్రి భర్త జెమిని గణేశన్‌ పాత్రలో నటిస్తున్నారట. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు భారతదేశ సినీ చరిత్రలో లేని  విధంగా భారీ సినిమా సెట్లు సిద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకాబోతోంది.