హలో కు అరుదైన గౌరవం

హలో కు అరుదైన గౌరవం

14-05-2018

హలో కు అరుదైన గౌరవం

అఖిల్‌ కథానాయకుడిగా నటించిన హలో చిత్రం మంచి విజయం అందుకుంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌లో హలో విదేశీ సినిమా కేటగిరీలో ఉత్తమ బెస్ట్‌ యాక్షన్‌ సినిమాగా నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని విక్రమ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

విదేశీ సినిమా కేటగిరీలో హలో నామినేట్‌ అయినందుకు గర్వంగా ఉంది. ఇందుకు నాగ్‌ సర్‌కు, అనూప్‌ రూబెన్స్‌, బాబ్‌ బ్రౌన్‌, పీఎస్‌ వినోద్‌, ప్రవీణ్‌ పూడిలకు శభాకాంక్షలు. మీరంతా యాక్షన్‌ ఎపిసోడ్లను మరింత ప్రత్యేకంగా వచ్చేలా చేశారు. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన అఖిల్‌కు శుభాకాంక్షలు. నీకున్న యాటిట్యూడ్‌ నిన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మచ్‌ లవ్‌ అని పేర్కొన్నారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ అఖిల్‌కు తల్లిదండ్రులుగా కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు.