అమెరికాలో కాదు.. ముందు భారత్ లో!

అమెరికాలో కాదు.. ముందు భారత్ లో!

14-05-2018

అమెరికాలో కాదు.. ముందు భారత్ లో!

2015లో వచ్చిన జురాసిక్‌ పార్క్‌కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం జురాసిక్‌ వరల్డ్‌ ఫాలెన్‌ కింగ్‌డమ్‌. జేఏ బెయోనా దర్శకుడు, క్రిస్‌ ప్రాట్‌, బ్రెసీ డల్లాస్‌ హోవర్డ్‌, బి.డి.వాంగ్‌ కీలక పాత్రలు పోషించారు. యూనివర్సిల్‌ పిక్చర్స్‌, అంబ్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ది కెనడీ మార్షల్‌ కంపెనీ, లెజండరీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం అమెరికాలో కంటే ముందు భారత్‌లో విడుదల కాబోతోంది. ఇక్కడ జూన్‌ 8న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇంగ్లిషు, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.