నిన్న నయన... నేడు నికిషా?

నిన్న నయన... నేడు నికిషా?

15-05-2018

నిన్న నయన... నేడు నికిషా?

నయనతారతో పీకల్లోతు ప్రేమాయణం నడిపి, కెరీర్‌ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసిన ప్రభుదేవా ఇప్పుడు అదే పని నికిషా పటేల్‌తో చేస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన కొమరం పుల్లి చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నికిషా పటేల్‌కు, ఆ చిత్రం ఘోరంగా పరాజయం పాలు కావడంతో అవకావాలు వెల్లువెత్తకపోయినా, అడపాదపా ఆఫర్స్‌ వస్తూనే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నికిషాతో ప్రస్తుతం ప్రభుదేవా ప్రేమాయణం నడుపుతున్నాడు. ప్రస్తుతం గుంటూరు టాకీస్‌ 2లో నటిస్తున్న నికిషా పటేల్‌ తమిళనంలో నాలుగయిదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరి హిందీ సినిమాల్లో అవకాశాలిస్తానని ఆశ చూపాడో, లేక పెళ్లి చేసుకుంటానని ఇంతకుముందులాగే ప్రగల్భాలు పలికాడో తెలియదు కానీ, గత కొంతకాలంగా పటేల్‌తో కలిసి ప్రభుదేవా చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని సమాచారం. యాభై ఏళ్లకు చేరువలో ఉన్న ప్రభుదేవా ఇలా హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటుండడం కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.