కర్నాటక ఎన్నికల్లో సాయికుమార్ ఓటమి

కర్నాటక ఎన్నికల్లో సాయికుమార్ ఓటమి

15-05-2018

కర్నాటక ఎన్నికల్లో సాయికుమార్ ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ టాలీవుడ్‌ నటుడు సాయికుమార్‌ ఓటమి పాలయ్యారు. బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌పై భారీ తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌ఎన్‌ సుబ్బారెడ్డి 41వేల ఓట్లతో విజయం సాధించారు. బాగేపల్లిలో రెండో స్థానంలో సీపీఎం, మూడో స్థానంలో జేడీఎస్‌ ఉన్నాయి. నాలుగో స్థానంలో సాయి కుమార్‌ ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ మంచి విజయం దక్కగా, సాయికుమార్‌కు మాత్రం బీజేపీ తరపున పోటీ చేసినా పార్టీ ప్రభావమేమీ కనిపించలేదు. బాగేపల్లి సాయికుమార్‌ తల్లి సొంత నియోజకవర్గం. అక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడే వారే ఉంటున్నప్పటికీ సాయికుమార్‌కు ఏమాత్రం లాభం చేకూరలేదు. బాగేపల్లిలో రెడ్డి వర్గం ప్రాబల్యం అధికంగా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎస్‌ఎన్‌ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గ నుంచి సాయికుమార్‌ గతంలో కూడా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు.