న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో కేరాఫ్ కంచరపాలెం

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో కేరాఫ్ కంచరపాలెం

17-05-2018

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో కేరాఫ్ కంచరపాలెం

గత కొన్ని రోజులుగా కేరాఫ్‌ కంచరపాలెం అనే చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో హల్‌ చల్‌ చేస్తోంది. అందరూ కొత్తవాళ్లతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ సందడి చేస్తోంది. న్యూయార్క్‌లో స్థిరపడిన కార్డియాలజిస్ట్‌, మరియు తెలుగమ్మాయి డాక్టర్‌ విజయ ప్రవీణ పరుచూరి నిర్మించిన ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. వెంకట్‌ మహా అనే కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం న్యూయార్క్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి ప్రశంసలందుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్‌ లేదా జులైలో విడుదల చేసేందుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేష్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు.