రాజమౌళికి అరుదైన గిఫ్ట్స్

రాజమౌళికి అరుదైన గిఫ్ట్స్

17-05-2018

రాజమౌళికి అరుదైన గిఫ్ట్స్

ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ఎంత ఖ్యాతిని పొందాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరల్డ్‌వైడ్‌గా బాక్సాపీస్‌ వద్ద కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించాయి. బాహుబలి 2 సక్సెస్‌ ను ఇంకా ఎంజాయ్‌ చేస్తునే ఉన్నారు రాజమౌళి. ఇటీవలే విదేశాల్లో పర్యటించిన రాజమౌళి అండ్‌ టీం అక్కడ బాహుబలి 2కు వస్తున్న రెస్పాన్స్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా జపాన్‌లో బాహుబలి 2 చిత్రాన్ని సినీ ప్రియులు నీరాజనాలు పలుకుతున్నారు.

రాజమౌళి తన టూర్‌ను విజయవంతంగా ముగించుకుని జపాన్‌ వాసులు బహుకరించిన అరుదైన బహుమతులతో తిరిగొచ్చాడు. తనకు వచ్చిన గిఫ్ట్‌ ప్యాక్స్‌ను ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కోటిగా చూపిస్తూ ఉన్న ఫొటోలనూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకున్నాడు రాజమౌళి. బాహుబలి చిత్రం థీమ్‌తో గీసిని చిత్రాలు గిఫ్ట్‌ ఫ్యాక్‌లో ఉన్నాయి. ప్రతీ బహుమతిని అద్భుతమైన కళతో రూపొందించారు. మా కోసం కృషి చేసిన జపాన్‌ సినీ ప్రియులకు ధన్యవాదాలు. ఇవి మాకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించాయి అని క్యాప్షన్‌ పెట్టాడు రాజమౌళి. 2017 డిసెంబర్‌ 29న జపాన్‌లో విడుదలైన బాహుబలి 2 మూవీ ఏప్రిల్‌ మొదటివారానికి విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది.