ఆమెకు సమాన గౌరవం దక్కాలి : పటేల్

ఆమెకు సమాన గౌరవం దక్కాలి : పటేల్

11-06-2018

ఆమెకు సమాన గౌరవం దక్కాలి :  పటేల్

బాలీవుడ్‌ నటి సన్నీలియోనీకి మద్దతుగా నిలిచారు పటేదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌. ఓటర్లకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు హార్దిక్‌ జులై నుంచి మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తన యాత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి సన్నీ లియోనీపై మీ అభిప్రాయమేంటి? అని హార్దిక్‌ను అడిగారు. ఇందుకు హార్దిక్‌ సమాధానమిస్తూ సన్నీలియోనీని ఇతర నటీనటుల లాగా ఎందుకు చూడరు? నర్గిస్‌, శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లాంటి నటే సన్నీ లియోనీ కూడా. గతంలో ఆమె పోర్న్‌స్టార్‌గా పనిచేసిందని ఇప్పుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం సబబు కాదు. ఒకవేళ మన ఆలోచనా విధానం మారకపోతే దేశం ఎప్పటికీ మారదు అన్నారు. గతంలోనూ సన్నీకి మద్దతుగా నిలిచారు హార్దిక్‌.