అమెరికాకు ఇళయదళపతి పయనం

అమెరికాకు ఇళయదళపతి పయనం

11-06-2018

అమెరికాకు ఇళయదళపతి పయనం

విజయ్‌, ఏఆర్‌.మురుగదాస్‌ల టీమ్‌కు అమెరికాకు పయనం కానుంది. ఇళయదళపతి విజయ్‌ 62వ చిత్రం షూగింగ్‌ వడివడిగా పూర్తి చేసుకుంటోంది. తుపాకీ, కత్తి చిత్రాల తరువాత విజయ్‌, దర్శకుడు ఏఆర్‌. మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటి కీర్తీసురేశ్‌ కథానాయకిగానూ, వరలక్ష్మీశరత్‌కుమార్‌ ప్రతినాయకి పాత్రలోనూ నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటుడు రాధారవి, పళ.కరుప్పయ్య రాజకీయవాదులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర షూటింగ్‌ ఇప్పటికి 70 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. జూలైలోపు చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.  తదుపరి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించారు. త్వరలోనే చిత్ర యూనిట్‌ అమెరికాకు పయనం కానుంది. ఈ నెల 22న విజయ్‌ పుట్టినరోజు. అయితే ఆ రోజు ఆయన అమెరికాలో ఉంటారు.